టీసీఎస్ కు భారీ ఎదురు దెబ్బ… అమెరికాలో
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా హెల్త్ కేర్ విభాగానికి చెందిన ఎపిక్ సిస్టమ్ అనే సంస్థ స్థానిక జిల్లా కోర్ట్‌లో టీసీఎస్‌కు వ్యతిరేకంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కేసు వేసింది. ఈ కేసులో జిల్లా కోర్ట్ టీసీఎస్‌కు విధించిన 140 మిలియన్ డాలర్ల జరిమానాను యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఏకిభవించింది. డిస్ట్రీక్ కోర్ట్ టీసీఎస్‌కు విధించిన ఫైన్ రాజ్యాంగబద్ధమైందని సమర్థించింది. మనుషులు తమ తెలివితేటలతో సృష్టించే ఆవిష్కరణల్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) లేదా మేధో సంపత్తి అంటారు. ఇప్పుడిదే అంశంలో టీసీఎస్ తీరును తప్పుబడుతు ఎపిక్ సిస్టమ్ కంపెనీ యూఎస్ జిల్లా కోర్ట్‌ను ఆశ్రయించింది. ఆ కేసులో విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్ కోర్ట్ టీసీఎస్‌కు 140 మిలియన్ డాలర్లను ఫైన్ విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ టీసీఎస్ యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ ఎదుట తన వాదనల్ని వినిపించింది. విచారణ సందర్భంగా అమెరికా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఆదేశాలను పాటించడంలో జిల్లా కోర్టు విఫలమైందని, నష్టపరిహారాన్ని 10 నుంచి 25 మిలియన్ డాలర్లకు తగ్గించడానికి నిరాకరించిందని టీసీఎస్ వాధించింది. అయితే భారీ (140 మిలియన్ డాలర్ల) జరిమానా తీర్పు విషయంలో జిల్లా కోర్ట్ తీర్పును సమర్ధిస్తున్నామని కోర్ట్ ఉత్తర్వుల్లో పేర్కొంది.






