మెటాపై ట్విట్టర్ లీగల్ యాక్షన్!
ట్విట్టర్ వ్యాపార రహస్యాలను, మేధో సంపత్తిని మెటా చట్ట విరుద్ధంగా వాడుకుంటున్నదని ట్విట్టర్ అటార్నీ జనరల్ అలెక్స్ స్పిరో మెటా సీఈవో మార్క్ బుకెర్బర్గ్కు రాసిన లేఖలో ఆరోపించారు. దీనికి మెటా అధికార ప్రతినిధి ఆండీ స్టోన్ స్పందిస్తూ.. థ్రెడ్స్ ఇంజినీరింగ్ టీమ్‌లో ట్విట్టర్ మాజీ ఉద్యోగులెవరూ లేరని స్పష్టం చేశారు. ఈ విషయంలో నష్ట పరిహారం అడగాలనుకుంటున్నామని, కోర్టు ఇంజంక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నట్టు స్టోన్ స్పష్టం చేశారు. మోసంచేయడం తగదని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు.






