Telangana Jagruthi: సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి పోటీ
పురపాలిక ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తు (Lion symbol)పై తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేయనున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్ (Javed Latif), ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి (Buchireddy) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో కూడా కలిసి పని చేయాలని అంగీకారానికి వచ్చారు. హైదరాబాద్లోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 2 పార్టీల ముఖ్య నేతలు చర్చించి పురపాలిక ఎన్నికల్లో కలిసి పని చేయాలని నిర్ణయానికి వచ్చారు.






