భారీ అప్పుల్లో ట్విటర్
ప్రకటనలు సగానికి పైగా తగ్గడంతో ట్విటర్ భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నట్లు సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ వెల్లడించారు. నగదు ప్రవాహ స్థితి ఇప్పటికీ ప్రతికూలం గానే ఉందని, ప్రకటనల ఆదాయం దాదాపు 50 శాతం క్షీణించడంతో పాటు సంస్థ భారీ రుణభారంలో ఉందని తెలిపారు. కంపెనీ ఏదైనా చేయడానికంటే ముందుగా సరిపడా నగదు నిల్వలకు చేరుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గతేడాది 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక, తీసుకున్న చర్యలతో ప్రకటనదార్ల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఏప్రిల్`జూన్ త్రైమాసికం నాటికి కంపెనీ నగదు నిల్వలు సానుకూలంగా మారుతాయని ఆ త్రైమాసికం ప్రారంభంలో పేర్కొన్నారు.






