కెనడా సంస్థతో మాస్‌చిప్ భాగస్వామ్యం

హైదరాబాద్‌కు చెందిన మాస్‌చిప్ టెక్నాలజీస్, కెనడా సంస్థ టెన్‌స్టోరెంట్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. టెన్‌స్టోరెంట్‌కు అమెరికా, ఐరోపాలతో పాటు మనదేశంలోని బెంగళూరులో గ్లోబల్ కార్యాలయాలు ఉన్నాయి. ఏఎస్‌ఐసీ డిజైన్, అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, న్యూరల్ నెట్‌వర్క్ కాంపిలెర్స్ విభాగాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. తాజా ఒప్పందం వల్ల టెన్‌స్టోరెంట్‌కు చెందిన ఆర్‌ఐఎస్‌సీ`వీ సొల్యూషన్ల డిజైన్‌పై పనిచేసే అవకాశం మాస్‌చిప్‌కు లభిస్తుంది.