టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గత ఏడాది విడుదలై జాబ్ మార్కెట్లో అలజడి సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై 8 వేల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. వ్యూహాత్మక అడుగుతో జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ డిమాండ్‌ను తీర్చేందుకు కంపెనీ సన్నద్దమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా టెక్ మహీంద్రా గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, మార్కెటింగ్ హెడ్ హర్షేంద్ర సోయిన్ సంస్థ వృద్ధి సాధించడంలో ఏఐ ప్రాముఖ్యతను వివరించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, మ్యానఫాక్చరింగ్, రిటైల్‌పై సంస్థ దృష్టి సారించినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా సంస్థ నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు. జాబ్ మార్కెట్లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ టెక్ మహీంద్ర తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






