Brian Nichol : టిమ్‌కుక్, సుందర్ పిచాయ్ కంటే ఈయనకే అధికం

ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్(Starbucks) సీఈవో బ్రియాన్ నికోల్ (Brian Nichol) తన మొదటి నాలుగు నెలల వేతనం ఏకంగా 96 మిలియన్ డాలర్లు (సుమారు రూ.827 కోట్లు) అందుకున్నారు. అమెరికాలో కార్పొరేట్ అతిపెద్ద ప్యాకేజీల్లో ఇదీ ఒకటి. టెక్ కంపెనీ యాపిల్ సీఈవో టిమ్ కుక్(Tim Cook), గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(Sundar Pichai ) కంటే అధిక ప్యాకేజీని నికోల్ అందుకున్నారు. అదే నాలుగు నెలలకు ఒక్కొక్కరు 75 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.646 కోట్లు ) అందుకున్నారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడిరచింది. గతేడాది సెప్టెంబర్ ప్రారంభంలో స్టార్‌బక్స్‌లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు నికోల్.