Smartphones : అమెరికాకు స్మార్ట్‌ఫోన్లు.. చైనాను మించిన భారత్

స్మార్ట్‌ఫోన్ల (Smartphones ) ఎగుమ తుల్లో భారత్ దేశం సత్తా చాటుతోంది. జూన్ త్రైమాసికంలో అమెరికా (America)కు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో తొలిసారిగా చైనా (China) ను అధిగమించింది. 700 కోట్ల డాలర్ల (సుమారు రూ.60,774 కోట్లు) విలువైన స్మార్ట్‌ఫోన్లు అమెరికాకు ఎగుమతి చేసింది. దీంతో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో అమెరికా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో మన దేశం వాటా 13 నుంచి 44 శాతానికి (240 వృద్ధి) చేరింది. ఇదే సమయంలో చైనా వాటా 61 నుంచి 25 శాతానికి పడిపోయింది. జూన్ త్రైమాసికంలో తొలిసారిగా అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతిలో మన దేశం చైనాను మించిపోయింది. యాపిల్ (Apple) పెద్ద ఎత్తున ఎగుమతులు పెంచడం, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం అని కెనాలిస్ సంస్థ ప్రిన్సిపల్ అనలిస్ట్ సన్యం చౌరాసియా (Sanyam Chaurasia) చెప్పారు.