America: అమెరికా టారిఫ్‌లపై 8-10 వారాల్లో పరిష్కారం : అనంత నాగేశ్వరన్

మన ఉత్పత్తులపై అమెరికా అధిక టారిఫ్‌ల విషయంలో, వచ్చే 8-10 వారాల్లో పరిష్కారం లభించగలదని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ (Anantha Nageswaran) అంచనా వేస్తున్నారు. రష్యా (Russia) చమురును కొంటున్నందుకు, భారత ఉత్పత్తులపై అమెరికా అదనంగా విధించిన 25 శాతం పెనాల్టీ టారిఫ్ ఆగస్టు నుంచి అమల్లోకి రావడంతో, మొత్తం టారిఫ్ 50 శాతనికి చేరింది. ఒక కార్యక్రమంలో అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ భారత్ (India) , అమెరికా ప్రభుత్వ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. నా అంచనా ప్రకారం వచ్చే 8-10 వారాల్లో ఇవి కొలిక్కి వస్తాయి. భారత వస్తువులపై అమెరికా (America) విధిస్తున్న టారిఫ్‌లకు ఒక పరిష్కారాన్ని మనం చూడగలమన్నారు. నవంబరు చివరికల్లా 25 శాతం అదనపు టారిఫ్‌ను తొలగించవచ్చని అన్నారు.