H-1B: హెచ్-1 బీ వీసాదారులకు మైక్రోసాఫ్ట్ అడ్వైజరీ..తక్షణమే అమెరికాకు

హెచ్-1బీ (H-1B) వీసాదారుల వార్షిక రుసుము లక్ష డాలర్లు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్నహెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు సెప్టెంబరు 21లోపు అమెరికా (America) తిరిగిరావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గత ఈమెయిల్ (Email) పంపించినట్లు సమాచారం. అయితే అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని సంస్థ సూచించినట్లు సమాచారం. అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.