ASEAN Summit: అక్టోబరులో ఆసియాన్ సమ్మిట్

భారత్‌పై అమెరికా అధిక టారిఫ్‌లు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ ప్రధాని మోదీ(Modi), అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) హాజరుకానున్న ఆసియాన్ సమ్మిట్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మలేషియాలో అక్టోబరులో జరగనున్న ఈ సమ్మిట్ సందర్భంగా వీరిద్దరి మధ్య వ్యక్తిగత సమావేశం కూడా జరిగే అవకాశం ఉందని అంచనా. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈ నెల 16న ట్రంప్, మోదీల మధ్య ఫోన్ సంభాషణ చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ నెలాఖరులో జరగనున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశానికి ప్రధాని అమెరికా వెళ్లబోవడం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఆసియాన్ సమ్మిట్ సందర్భంగా మోదీ, ట్రంప్‌ల మధ్య వ్యక్తిగత సమావేశం జరిగే పక్షంలో నవంబరులో భారత్‌లో జరిగే క్వాడ్ దేశాధినేతల సమావేశానికికూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరుకావచ్చు.