Randhir Jaiswal : వారి ట్రాప్‌లో పడొద్దు …అప్రమత్తంగా ఉండాలి : కేంద్రం వార్నింగ్

ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశపెట్టి, భారతీయ పౌరులను ఇరాన్ (Iran) తీసుకెళ్లి కిడ్నాప్ చేసిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. అలాంటి ట్రాప్‌లలో పడొద్దని హెచ్చరికలు జారీ చేసింది. భారతీయ పౌరులకు ఉద్యోగం ఇప్పిస్తామని, ఇరాన్ వెళ్లమని ప్రలోభాలకు గురిచేసిన కేసులు ఇటీవల కొన్ని వెలుగు చూశాయి. ఇరాన్‌కు చేరుకున్నాక వారిని క్రిమినల్ ముఠాలు కిడ్నాప్ (Kidnapping) చేశాయి. వారిని విడుదల చేయాలంటే డబ్బులు (Money) ఇవ్వాలని బాధిత కుటుంబాలను డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి ఉద్యోగ ఆఫర్ల విషయంలో కచ్చితమైన అప్రమత్తత పాటించాలని భారతీయులను కోరుతున్నా. పర్యాటక ప్రయోజనాల కోసం మాత్రమే ఇరాన్ ప్రభుత్వం భారతీయులకు వీసా (Visa) రహిత ప్రవేశాన్ని అనుమతిస్తోందనే విషయాన్ని గమనించాలి. ఉపాధి లేదా ఇతర ప్రయోజనాలను కోసం ఇరాన్ వెళ్లాలని సూచించే ఏజెంట్‌లు క్రిమినల్ ముఠాలతో కుమ్మక్కై ఉండవచ్చు. కాబట్టి వారి ట్రాప్‌లో పడకుండా, అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం అని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) హెచ్చరించారు.