Gaza: గాజా తీర్మానంపై అమెరికా వీటో

తక్షణం గాజా(Gaza) లో కాల్పుల విరమణ ప్రకటించాలని, బందీలను విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి అనుకూలంగా మండలిలో 14 దేశాలు ఓటేసినా అగ్రర్యాం మాత్రం ఇజ్రాయెల్ (Israel) కు అండగా వీటో చేసింది. ఇలా ఇజ్రాయెల్‌కు మద్దతుగా కాల్పుల విరమణ తీర్మానాన్ని అమెరికా వీటో చేయడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. తీర్మానంలో హమాస్ చర్యలను గట్టిగా ఖండిరచలేదని, అందుకే వ్యతిరేకించినట్లు అమెరికా పేర్కొంది. అనుకూలంగా ఓటేసిన దేశాలు గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.