America: అమెరికా, చైనా సంబంధాల్లో మరో ముందడుగు

అమెరికా, చైనా సంబంధాల్లో మరో ముందడుగు పడిరది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధినేత షీ జిన్‌పింగ్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ (TikTok) ను అమెరికా (America) లో యథాతథంగా కొనసాగించడంపై వారు చర్చించినట్లు సమాచారం. దీనిపై త్వరలో తుద ఒప్పందానికి రావాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు వైట్‌హౌస్ అధికారులు వెల్లడిరచారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించి, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్, జిన్‌పింగ్ (Jinping) భావిస్తున్నారు. త్వరలో ముఖాముఖి సమావేశమై ఒప్పందాన్ని కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.