హైదరాబాద్ బంజారాహిల్స్ లో సింగపూర్ కు చెందిన హోమ్స్ టు లైఫ్ స్టోర్ ప్రారంభం
సింగపూర్ కు చెందిన ప్రముఖ ఫర్నిచర్ సంస్థ అయిన హోమ్స్ టు లైఫ్ సంస్థ తన తొలి స్టోర్ ని హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ గోబల్ బ్రాండ్ హెడ్ సెలెస్టే ఫువా మాట్లాడుతూ.. విలాసవంతమైన గృహాలంకరణ ఉత్పత్తులను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ స్టోర్ ని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రముఖ స్థానంలో ఉందని ఈ కారణంగానే ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి రావాలని తాము స్టోర్ ని ఏర్పాటు చేశామన్నారు. సోఫాలు, డైనింగ్ సెట్స్, బెడ్ రూం, ఫర్నిచర్ అలంకార ఉత్పత్తులను ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు సంస్థ ఇండియా కంట్రీ హెడ్ వరుణ్ కాంత్ మాట్లాడుతూ డిజైనర్ ఔత్సాహికులు ఆర్కిటెక్లు గృహ యజమానుల ఆకాంక్షల నెరవేరుస్తూ ఈ స్టోర్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరి అభిరుచికి తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తులు లభ్యమవుతాయన్నారు.






