అదానీ, హిండెన్ బర్గ్ వివాదంలో మరో కీలక పరిణామం
అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బిలియనీర్ గౌతం అదానీ నేతృత్వంలోని కంపెనీలపైన చేసిన ఆరోపణలపై విచారణను ముగించేందుకు గడువును 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టేటస్ రిపోర్టును సమర్పించేందుకు గడువును పొడిగింంచాలని కూడా సెబీ కోరింది. ఈ ఏడాది మేలో ఈ అంశంపై అప్డేట్ చేసిన స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించేందుకు ఆగస్టు 14 వరకు సెబీకి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.






