ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై యూపీఐకు
ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్రెడిట్‌కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఇకపై తమ రూపే నెట్వర్క్ క్రెడిట్ కార్డులను యూపీఐ సేవలకు అనుసంధానం చేసుకునే సదుపాయాన్ని ఎస్బీఐ అనుబంధ ఎస్బీఐ కార్డ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై స్కాన్ చేసిన ఏదైనా కొనుగోలు చేసే సమయంలో క్రెడిట్ కార్డులను వినియోగించుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (ఎన్పీసీఐ) కలిసి ఎస్బీఐ కార్డ్ ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. రూపే నెట్‌వర్క్‌పై పనిచేసే క్రెడిట్ కార్డులను యూపీఐ యాప్స్‌తో అనుసంధానం చేసుకునే సదుపాయం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎస్బీఐ కార్డ్ ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఉచితంగా ఈ సేవలను పొందొచ్చని పేర్కొంది. రోజూ కోట్లాది లావాదేవీలు జరుగుతున్న యూపీఐ నెట్‌వర్క్‌కు క్రెడిట్‌కార్డులు అనుసంధానం చేయడం ద్వారా వాటి వినియోగం మరింత పెరగనుందని పేర్కొంది.






