అమెరికాలో శామ్టెల్ విస్తరణ
శామ్టెల్ ఎవియోనిక్స్ లిమిటెడ్ (ఎస్ఎ) ఉత్తర అమెరికాలో తన వ్యాపార అభివృద్ధి, మార్కెటింగ్ ప్రతినిధిగా జిఇఎం డిఫెన్స్ సొలూషన్స్ ఎల్ఎల్సిని నియమించినట్లు ప్రకటించింది. అంతర్జాతీయ విస్తరణ కార్యక్రమంలో భాగంగా హైటెక్నాలజీ సైనిక వ్యవస్థలు, ఉత్పత్తులతో భారతీయ సంస్థ శామ్టెల్ పేరుగాంచినది. జిఇఎం డిఫెన్స్ సొల్యూషన్స్ ఎల్ఎల్సి ప్రెసిడెంట్ గ్రేడాన్ (గ్రేడీ) మైహ్రే, అమెరికా, కెనడాలో వివిధ వ్యాపార అభివృద్ధి, మార్కెటింగ్ కార్యకలాపాలలో శామ్టెల్ ఎవియోనిక్స్కి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ అభివృద్ధి అంతర్జాతీయ మార్కెట్లోకి ఎస్ఎ గణనీయమైన ముందడుగును సూచిస్తుంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ పునీత్ కౌరా మాట్లాడుతూ గ్రేడీ మాతో కలిసినందుకు చాలా సంతోషిస్తున్నామని అన్నారు.






