తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించిన రాయల్ ఓక్ (Royaloak)
భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ ఓక్ ఫర్నిచర్, హైదరాబాద్ లోని మలక్ పేట లో తమ స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా భారతదేశంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. ఈ స్టోర్‌ను అభిమానుల సమక్షంలో రాయల్ ఓక్ ఫర్నిచర్ ఛైర్మన్ శ్రీ విజయ్ సుబ్రమణియం, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మథన్ సుబ్రమణియం, రిటైల్ హెడ్ హెచ్ ఎస్ సురేష్, ఆంధ్ర ప్రదేశ్&తెలంగాణ స్టేట్ హెడ్ ప్రద్యుమ్న కరణం, సేల్స్ & మర్చండైజింగ్ హెడ్ ప్రశాంత్ కోటియాన్ ప్రారంభించారు.
దాదాపు 18000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్ విస్తృత శ్రేణిలో లివింగ్ రూమ్స్, బెడ్రూమ్స్, డైనింగ్ రూమ్స్ మరెన్నో వాటికి తగిన ఫర్నిచర్ అందిస్తుంది. వినియోగదారులు సోఫాలు, రిక్లైనర్స్, డైనింగ్ టేబుల్స్, మ్యాట్రెసస్, బెడ్స్, ఇంటీరియర్ డెకార్ మరియు సమగ్ర శ్రేణి ఆఫీస్, ఔట్ డోర్ ఫర్నిచర్ తో సహా అనేక రకాల స్టైలిష్ మరియు ఫంక్షనల్ వస్తువులను కస్టమర్లు కనుగొనవచ్చు. ఈ స్టోర్ హైదరాబాద్ లో రాయల్ ఓక్ యొక్క మొత్తం స్టోర్స్ సంఖ్యను 19 కు చేర్చుతుంది. ఈ స్టోర్ ప్రతి సంవత్సరం 2 లక్షల కంటే ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించనుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాయల్ ఓక్ ఫర్నిచర్ చైర్మన్ శ్రీ విజయ్ సుబ్రమణియం మాట్లాడుతూ, ‘‘మా తాజా స్టోర్‌ను ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా వున్నాము. ఈ స్టోర్, సరసమైన ధరలలో అత్యుత్తమ ఫర్నిచర్ అందించాలనే రాయల్ఓక్ నిబద్దత కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ స్టోర్, మా వినియోగదారులకు అసాధారణమైన షాపింగ్ అనుభవాలను అందించగలదనే భరోసా కల్పించేందుకు మా బృందం తీవ్ర కృషి చేసింది. అత్యంత ఆకర్షణీయమైన మరియు పనితీరు కలిగిన ఫర్నిచర్ ను వినియోగదారులు ఇక్కడ ఎంచుకోవచ్చు. తమ ఇంటి కోసం ఖచ్చితమైన ఫర్నిచర్ ఎంచుకునేలాసహాయపడేందుకు వినియోగదారులను స్వాగతించేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.
ఆయనే మాట్లాడుతూ “ నగరంలోని ఈ ప్రాంతంలో చాలా మంది డెవలపర్లు భారీగా పెట్టుబడులు పెట్టడంతో రియల్ ఎస్టేట్‌లో నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌ను గమనించినందున మేము మా తదుపరి స్టోర్ ప్రారంభం కోసం మలక్ పేటను ఎంచుకున్నాము. ఇది ఈ ప్రాంతంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలలో మరింతగా వినియోగదారులకు సేవలను అందించటానికి బ్రాండ్‌కు అవకాశం కల్పిస్తుంది. ” అని అన్నారు.
ఈ స్టోర్‌లో ప్రత్యేకంగా ఎంపికచేసిన, సేకరించిన “కంట్రీకలెక్షన్” కూడాలభిస్తుంది. దీనిలో అమెరికా, ఇటలీ, వియత్నాం, టర్కీ, జర్మనీ, మలేషియా మరియు ఇండియా నుంచి పూర్తి వినూత్నమైన ఫర్నిచర్ సైతం లభించనుంది.
ఈ నూతన స్టోర్ ప్రారంభం పట్ల రాయల్ ఓక్ బృందాన్ని అభినందించిన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మథన్ సుబ్రమణియం మాట్లాడుతూ ” నాణ్యత మరియు వినియోగదారుల సంతృప్తి పట్ల ఈ టీం యొక్క అంకిత భావం స్ఫూర్తిదాయకం. వారు పడుతున్న కష్టం కు తగ్గ ప్రతిఫలం ఇక్కడ కన్పిస్తుంది. రాయల్ ఓక్ మలక్ పేట స్టోర్ బృందం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.
తమ ప్రత్యేకమైన స్వతంత్ర దుకాణాలతో, రాయల్ ఓక్ తమ ఆధునిక, విలాసవంతమైన మరియు సరసమైన ఫర్నిచర్‌తో ఏదైనా ఇంటి సౌందర్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. బ్రాండ్ తమ 5 మిలియన్లకు పైగా కస్టమర్ బేస్ యొక్క జీవనశైలి అవసరాలను తీర్చుతోంది.
దేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ అనుభవపూర్వక స్టోర్ లతో రాయల్ ఓక్ ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, చెన్నై, న్యూఢిల్లీ మరియు అహ్మదాబాద్ వంటి 116 కంటే ఎక్కువ ప్రదేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.






