జియో ఎయిర్ ఫైబర్ పై కీలక అప్ డేట్.. డిసెంబర్ నాటికి
గతేడాది 5జీ సేవలు ప్రారంభించిన రిలయన్స్ జియో ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఆ సేవలను తీసుకురానున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశంలో ఈ ప్రకటన చేశారు. దీంతో పాటు జియో ఫైబర్ సేవలను మరింత విస్తరించడంలో భాగంగా ఎయిర్ ఫైబర్ డివైజ్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అయితే, జియో ప్రీపెయిడ్ ప్లాన్స్, జియో 5జీ ఫోన్ల గురించి మాత్రం ఈ ఏజీఎంలో ప్రస్తావించలేదు. జియో టెలికాం సేవలను చందాదారుల సంఖ్య 45 కోట్లు దాటిందని తెలిపారు. 5జీ సేవలను ప్రారంభించిన 9 నెలల్లోనే 96 శాతం పట్టణాల్లో 5జీ నెట్వర్క్ విస్తరణ పూర్తయినట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి దేశవ్యాప్త సేవల విస్తరణ లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 5 కోట్ల మంది జియో 5జీ సేవలను ఆనందిస్తున్నారని తెలిపారు. జియో ద్వారా నెలకు సగటున 25జీబీ డేటా వినియోగం జరుగుతోందని తెలిపారు. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే, దీని ధర, ప్లాన్లు ఇతర వివరాలేవీ వెల్లడిరచలేదు. జియో ఫైబర్ నెట్ విస్తరణకు ఎయిర్ ఫైబర్ తోడ్పనుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.






