క్వాంటమ్ ఎనర్జీ, హైదరాబాదులో తన నాల్గవ ఎలెక్టిక్ వెహికల్ టూ-వీలర్ డీలర్షిప్ సదుపాయాన్ని ప్రారంభిస్తోంది
ఎలెక్ట్రిక్ స్కూటర్ల డిజైన్, అభివృద్ధి, మరియు తయారీలో ప్రత్యేకత పొందియున్న ఒక అగ్రగామి ఎలెక్ట్రిక్ వాహన (ఈవీ) అంకుర సంస్థ అయిన క్వాంటమ్ ఎనర్జీ, హైదరాబాద్ లోని ప్రకంపనాత్మక వాణిజ్య మరియు నివాస స్థావరమైన ఎల్.బి నగర్ యందు తన నాల్గవ డీలర్షిప్ సదుపాయం యొక్క ప్రారంభాన్ని ప్రకటించింది. వ్యూహాత్మకంగా ఇంటి నెం. 16-11-16/V/16, ప్రశాంత్ నగర్ కాలనీ, ఆర్టిఏ ఆఫీస్ దగ్గర, మూసారాంబాగ్, మలక్పేట్, హైదరాబాద్, తెలంగాణ-500 036 యందు నెలకొల్పబడియున్న ఈ 630 చదరపు అడుగుల షోరూము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మోటార్స్ వారిచే నడపబడుతోంది.
సెప్టెంబర్ 26 వ తేదీన గొప్ప ప్రారంభోత్సవ వేడుక జరిగింది, ఈ కార్యక్రమానికి క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ కుశాల్ సి గారు, ప్రధాన డీలర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా మోటార్స్ మరియు క్వాంటమ్ ఎనర్జీ నుండి ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. షోరూమును సందర్శించిన సందర్శకులు ప్లాస్మా, ఎలెక్ట్రాన్, మిలన్, మరియు బిజినెస్ మోడల్స్ చేరి ఉన్న క్వాంటమ్ ఎనర్జీ యొక్క ముచ్చటైన ఎలెక్ట్రిక్ స్కూటర్ల శ్రేణి యొక్క విస్తృతమైన ప్రదర్శనను తిలకించడానికి వీలు కల్పించబడుతుంది.
ప్రదర్శించబడుతున్న ఎలెక్ట్రిక్ స్కూటర్ల స్పెసిఫికేషన్లు:
ప్లాస్మా – దీనికి ఒక 1500 W మోటర్ ఉంది; అత్యధిక వేగం గంటకు 65 కిలోమీటర్లు; సింగిల్ ఛార్జ్ పైన ముచ్చటైన 110 కిలోమీటర్ల వ్యాప్తిని అందిస్తుంది. ధర – రు. 1,19,000 ఎక్స్-షోరూమ్, హైదరాబాద్.
ఎలెక్ట్రాన్ – దీనికి ఒక 1000 W మోటర్ ఉంది, అత్యధిక వేగం గంటకు 60 కిలోమీటర్లు; సింగిల్ ఛార్జ్ పైన 100 కిలోమీటర్ల వ్యాప్తిని అందిస్తుంది; ధర – రు. 89,629 ఎక్స్-షోరూమ్, హైదరాబాద్.
మిలన్ – ఇది 1000 W మోటరుతో నడపబడుతుంది; అత్యధిక వేగం గంటకు 60 కిలోమీటర్లు, మరియు సింగిల్ ఛార్జ్ పైన 100 కిలోమీటర్ల వ్యాప్తిని అందిస్తుంది; ధర రు. 85,470 ఎక్స్-షోరూమ్, హైదరాబాద్.
బిజినెస్ – దీనికి ఒక 1200 W మోటర్ ఉంది, అత్యధిక వేగం గంటకు 55 కిలోమీటర్లు, మరియు సింగిల్ ఛార్జ్ పైన 110 కిలోమీటర్ల వ్యాప్తిని అందిస్తుంది; ధర రు. 95,865 ఎక్స్-షోరూమ్, హైదరాబాద్.
ప్రారంభోత్సవం గురించి మాట్లాడుతూ, క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ. చక్రవర్తి చుక్కపల్లి గారు ఇలా అన్నారు, “హైదరాబాదు వంటి ముఖ్యమైన నగరములో మా నాల్గవ డీలర్షిప్ ప్రారంభించడమనేది హరిత భారతదేశం యొక్క మా దార్శనికత పట్ల ఒక ముఖ్యమైన పురోగతి అవుతోంది. అనేక సంవత్సరాలుగా, అసంఖ్యాకమైన డీలర్లతో మా బలమైన భాగస్వామ్యము, భారతదేశం పయనించే మార్గాన్ని విప్లవాత్మకం చేయడంలో మా భాగస్వామ్య నిబద్ధతకు ఒక తార్కాణముగా నిలుస్తోంది. ఇది మా కస్టమర్లకు మాత్రమే కాకుండా పర్యావరణం మరియు స్థానిక సమాజాలకు కూడా ప్రయోజనం కలిగించే సుస్థిరమైన, వినూత్నమైన రవాణా పరిష్కారాలలో మా పరస్పర నమ్మకం యొక్క ఫలితముగా ఉంది.
క్వాంటమ్ ఎనర్జీ యొక్క ఎలెక్ట్రిక్ స్కూటర్లు పర్యావరణ హితమైన మరియు సౌకర్యవంతమైన పట్టణ మొబిలిటీ భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహిస్తాయి. సొగసైన డిజైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానము, మరియు ముచ్చటైన పనితీరుతో, కర్బన పాదముద్రను తగ్గిస్తూనే అవి ఉల్లాసకరమైన సవారీ అనుభవాన్ని అందిస్తాయి. గణనీయంగా, ప్రతి క్వాంటమ్ ఎనర్జీ షోరూము, కస్టమర్లు నిరంతరాయమైన మరియు సమీకృతమైన సేవను ఆనందించేలా చూసుకుంటూ సేల్స్, సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్ మద్దతు కలిగియున్న ఒక 3S సదుపాయముగా పనిచేస్తుంది. ఈ కొత్త షోరూము యొక్క జోడింపుతో, క్వాంటమ్ ఎనర్జీ, ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మొత్తం 43 షోరూములతో తన దేశవ్యాప్త ఉనికిని తదుపరి ఘనంగా బలోపేతం చేసుకుంటోంది.






