ఎన్నికల వేళ కేంద్రం … మరో కీలక నిర్ణయం

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అధిక ఇంధన ధరలతో అవస్థలు పడుతున్న వాహనదారులకు కాస్త ఉపశమనంన కలిగించే ప్రకటన చేసింది. లీటరు పెట్రోల్, డీజిల్ పై రూ. చొప్పున తగ్గిస్తున్నట్లు తెలిపింది. కొత్త ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర చమురు శాఖ తెలిపింది. తాజా ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 94.72, డీజిల్ రూ.87.62గా ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఇంధన ధరలపై నియంత్రణాధికారాన్ని కేంద్ర చమురు సంస్థలకు బదిలీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ధరల పెంపు, తగ్గింపులను ఆయా సంస్థలే నిర్ణయిస్తూ వెల్లడిస్తుండేవి. అయితే తాజా నిర్ణయాన్ని ఎన్నికల షెడ్యూల్ వెల్లడికి ముందే కేంద్ర చమురుశాఖ ప్రకటించడం విశేషం.