S1 Air డెలివరీలను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్
బెంగుళూరు, 24 ఆగస్ట్, 2023: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ S1 Air డెలివరీలను ప్రారంభించింది. గత నెలలో ప్రవేశపెట్టబడిన ఈ స్కూటర్ ఇప్పటివరకు 50,000 బుకింగ్‌లతో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన EV స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. S1 Air యొక్క డెలివరీలు 100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభమయ్యాయి మరియు ఇతర మార్కెట్లలో త్వరలో మొదలవనున్నాయి.
అందుబాటు ధరలకే మార్కెట్ లభ్యమవుతున్న S1 ఎయిర్ EVలను భారతదేశంలో పెద్దఎత్తున స్వీకరింపజేసే లక్ష్యంతో వచ్చిన ఖచ్చితమైన అర్బన్ సిటీ రైడ్ కంపానిన్. తక్కువ రన్నింగ్ మరియు మెయింటెనెన్స్ ఖర్చుతో, ఇది అత్యాధునిక సాంకేతికత మరియు డిజైన్ ఎలిమెంట్లను S1 మరియు S1 Pro నుండి వారసత్వంగా పొందింది.
S1 Air బలమైన 3 kWh బ్యాటరీ సామర్థ్యం, 6kW గరిష్ట మోటారు శక్తి, 151 కిమీల సర్టిఫైడ్ రేంజ్ మరియు 90 km/hr యొక్క విశేషమైన గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా, S1 Air ఆరు అద్భుతమైన రంగులలో (స్టెల్లార్ బ్లూ, నియాన్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్ మరియు మిడ్నైట్ బ్లూ) అందుబాటులో ఉంది మరియు ట్విన్ ఫ్రంట్ ఫోర్క్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, భారీ 34-లీటర్ బూట్ స్పేస్ మరియు డ్యూయల్-టోన్ బాడీ కలిగిఉంది.
ఆసక్తిగల కస్టమర్లు దేశవ్యాప్తంగా 1,000కు పైగా ఉన్న ఓలా అనుభవ కేంద్రాలలో S1 Air మరియు సులభమైన ఫైనాన్సింగ్ ఎంపికల గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు మరియు Ola యాప్ ద్వారా వారి కొనుగోలు ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు.






