America :అమెరికా ఆర్థిక సేవల సంస్థకు భారతీయ సీఈఓ

అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ యూఎస్ బ్యాంకార్ప్‌నకు తదుపరి సీఈఓ ( ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా గుంజన్ కేడియా (Gunjan Kedia )నియమితులయ్యారు. ఈ కంపెనీకి నేతృత్వం వహించబోయే తొలి భారతీయ అమెరికన్ (Indian American) ఈమే. ఏప్రిల్ 16న జరిగే వార్షిక వాటాదార్ల సమావేశం అనంతరం, సీఈఓ (CEO)గా కేడియా బాద్యతలు స్వీకరించడంతో పాటు డైరెక్టర్ల బోర్డులోనూ చేరతారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న యాండీ సిసీర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మారతారు. 2016 నుంచి యూఎస్ బ్యాంకార్ప్‌లో పనిచేస్తున్న గుంజన్‌కు ఆర్థిక సేవల పరిశ్రమలో మూడు దశాబ్ధాల అనుభవం ఉంది. ఢల్లీికి చెందిన కేడియా, ఢల్లీి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, కార్నిగే మెలన్ యూనివర్సిటీలో ఎంబీఏ (MBA) చేశారు.