అమెరికాలో నాట్కో ఫార్మాపై
జెనరిక్ క్యాన్సర్ ఔషధానికి సంబంధించి అమెరికాలో నాట్కో ఫార్మాపై యాంటీట్రస్ట్ కేసు దాఖలైంది. నాట్కోతో పాటు సెల్జీన్ కార్పొరేషన్, బ్రిస్టల్స్ మేయర్స్ స్విబ్ తదితర కంపెనీలను కూడా ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. లూసియానా హెల్త్ సర్వీస్ అండ్ ఇండెమ్మిటీ కంపెనీ, బ్లూ షీల్డ్ ఆఫ్ లూసియానా, హెచ్ ఎంఓ లూసియానా ఇంక్ ఈ యాంటీ ట్రస్ట్ కేసును దాఖలు చేశాయి. క్యాన్సర్ ఔషధం పొమలిడోమైడ్కు సంబంధించి కేసు వేశారని, బలమైన కారణాలు లేనందున ఈ కేసులో తమకే అనుకూల తీర్పు వచ్చే వీలుందని నాట్కో వెల్లడించింది.






