Satya Nadella :భారత్‌లో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి : సత్య నాదెళ్ల

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టనుంది. దేశంలో క్లౌడ్, కృత్రిమ మేధ సామర్థ్యాలను విస్తరించడం, డేటా సెంటర్ల (Data centers ) విస్తరణ కోసం 3 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) వెల్లడిరచారు. అలాగే, 2030 నాటికి 10 మిలియన్ల మందికి (కోటి మందికి) ఏఐ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బెంగళూరు (Bangalore) వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు.