India: భారత్ సూపర్ పవర్ కావాలంటున్న వర్థమాన ప్రపంచం…?
ఇప్పుడు ప్రపంచానికి సూపర్ పవర్ అమెరికా.. అందుకే అగ్రరాజ్యాధినేతగా ట్రంప్(TRUMP).. ఎడా,పెడా టారిఫ్ వార్ చేస్తున్నారు. మిత్రుడు, శత్రువు తేడా లేదు.. బిజినెస్ బిజినెస్సే అంటూ ముందుకు సాగుతున్నారు ట్రంప్. సాక్షాత్తూ పక్కనే ఉన్న ఫ్రెండ్ కెనడాకే.. గట్టిగా గిచ్చివదిలిన గ్రేట్ బిజినెస్ మ్యాన్ ట్రంప్. అందుకే.. ఇప్పుడు అమెరికాను చూసి భయపడుతున్న ప్రపంచదేశాలు… ఆయన మాటల్ని మాత్రం విశ్వసించే సాహసం చేయడం లేదు.
ఇక చైనా(CHINA) ఉంది.. అంటే ఎవరికీ అంతుచిక్కదు. తన ప్రయోజనాలుమాత్రమే చూసుకుంటూ ముందుకు సాగే దేశమది. దశాబ్దాల నుంచి డ్రాగన్ దేశాన్ని దగ్గరగా చూస్తున్న ప్రపంచం.. ఆ దేశంతో బంధమంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంది. ఇక మిగిలిన ప్రపంచదేశాలు ఉన్నాయంటే యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం, ఇతరత్రా కొట్టుమిట్టాడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలని చాలా వరకూ దేశాలు కోరుకుంటున్నాయి. ఎందుకంటే ప్రధాని మోడీ నాయకత్వంలోని భారత్ వృద్ధి, విధానాలు.. ప్రపంచదేశాలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
కోవిడ్ సమయంలో అగ్రరాజ్యాలుగా పేరున్నవి… వాటి ప్రయోజనాలు అవి చూసుకున్నాయి. కానీ పేద దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలను అస్సలు పట్టించుకోలేదు. అవి మాకు కోవిడ్ వ్యాక్సిన్ కావాలని కోరినా.. బిజినెస్ చూశాయి తప్ప, వాటి బాధలను పట్టించుకోలేదు. అలాంటి తరుణంలో భారత ప్రధాని మోడీ..ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సీన్లు సరఫరా అయ్యేలా చేశారు. ప్రపంచంలో చాలా పేద దేశాలకు ఆపన్నహస్తం చాచారు. ఇక భూకంపాలు, ప్రకృతి ప్రకోపాలు వచ్చిన సమయంలో కూడా భారత్.. తన వంతుగా ఆయా దేశాల పునర్నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. కష్టకాలంలో లంకకు భారత్ చాలా పెద్ద సాయమే చేసింది. ఇవన్నీ చూసిన ప్రపంచదేశాలకు… భారత్ నాయకత్వంపై విశ్వాసం పెరుగుతోంది.
అందుకే లేటెస్టుగా ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్.. భారత్ రానున్న రోజుల్లో సూపర్ పవర్ గా మారుతుందన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ సూపర్ కానుందన్నారు. అంతేకాదు.. తాను భారత్ కు వీరాభిమానినని స్వయంగా చెప్పుకున్నారు. భారత్ , మరీ ముఖ్యంగా మోడీతో .. స్టబ్ కు మంచి సంబంధాలున్నాయి. ఈపరిణామాలు చూస్తుంటే .. త్వరలోనే ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించే పరిస్థితి వస్తుందన్న ఆశలు అందరిలోనూ చిగురిస్తున్నాయి.







