KTR: వాటి ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక : కేటీఆర్
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే జిల్లాల తొలగింపునకు అనుమతించడమేనని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్‌ని కుంభకోణంగా పేర్కొన్నవారు, దావోస్‌లో (Davos) అదే గ్రీన్‌కోతో చర్చలు జరపడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. సింగరేణి (Singareni)పై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల (Municipal elections) కోసం మున్సిపాలిటీల వారీగా పార్టీ ఇన్ఛార్జులను నియమించుకున్నామని, ఉమ్మడి జిల్లాలకు చెందిన వారికే బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. సర్వేలు కూడా చేయిస్తున్నామని, వాటి ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం కాలికి బలపం కట్టుకొని తిరిగినా సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నిస్థానాలు వచ్చాయో ప్రజలందరూ చూశారని వ్యాఖ్యానించారు. లేని ఫ్యూచర్ సిటీ పేరుతో జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న సీఎం దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.






