Kavitha: అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు : కవిత
త్వరలో జరగనున్న మన్సిపల్ ఎన్నికల (Municipal elections)పై తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ (Mucherla Satyanarayana) జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు. జాగతి ఇంకా పూర్తిస్తాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు మద్దతు కోరినా ఇస్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసు తుదిదశకు చేరుతుందనే నమ్మకం తనకు లేదన్నారు. తనలాంటి బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదని చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలన్నారు. ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహం అక్కడ పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






