Supreme Court: మద్యం కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎదురుదెబ్బ తలిగింది. బాలాజీ గోవిందప్ప (Balaji Govindappa), కృష్ణమోహన్ రెడ్డి (Krishnamohan Reddy), ధనుంజయ్‌రెడ్డి (Dhanunjay Reddy)కి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీని కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సీజేఐ ధర్మాసం సూచిస్తూ 4 వారాల గడువు ఇచ్చింది. నిందితులు ముగ్గురూ ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్‌పై ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో డిఫాల్ట్ బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా మార్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిబంధనలు అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






