Visakha Utsav: 24న విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ఉత్తరాంధ్ర సాంస్కతిక వైభవాన్ని, ప్రకతి సౌందర్యాన్ని చాటి చెప్పేలా ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవ్‌ను (Visakha Utsav) నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రుల బందం తెలిపింది. సాగరం నుంచి శిఖరం వరకు అనే నినాదంతో నిర్వహించే ఈ ఉత్సవ్ ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్లో మంత్రుల బందం సమీక్షించింది. అనంతరం వీఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్ (Kandula Durgesh), వంగలపూడి అనిత (Anita Vangalapudi), డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి(Sandhya Rani) ఉత్సవ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం దుర్గేష్ మాట్లాడుతూ 24న విశాఖలో ఉత్సవాల ప్రారంభమై, ఫిబ్రవరి 1న అనకాపల్లిలో ముగుస్తాయి. ఉత్తరాంధ్రలో 20 ప్రధాన కేంద్రాల్లో 500కు పైగా సాంస్కతిక, పర్యాటక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం అని పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






