Minister Narayana: మంత్రి నారాయణతో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ (Minister Narayana)తో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ (Gareth Wyn Owen) అమరావతిలోని సీఆర్డీఏ (CRDA) కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిని ఓవెన్కు మంత్రి వివరించారు. అమరావతి అభివృద్ధి లో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని ఓవెన్ తెలిపారు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ (International Sports City) ప్రాజెక్టులపై ఆయన ఆసక్తి కనబరిచినట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






