Pakistan: పాకిస్తాన్ అణ్వస్త్రాలకు పదును పెడుతోందా…?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) తమ అణ్వస్త్ర ప్రయోగాలను పునరుద్దరిస్తున్నామంటూనే మిగిలిన దేశాలు అణ్వస్త్రాల దిశగా సాగుతున్నాయంటూ పాక్ ను ప్రస్తావించడం.. ఆ దేశానికి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లైంది. అసలే ఐఎంఎఫ్ సహా ఇతర దేశాల నుంచి తెచ్చి న అప్పులతో .. పాలన సాగిస్తున్న పాకిస్తాన్, ఇప్పుడు దీన్ని అంగీకరిస్తే .. పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఇక ఏ దేశం, ఏ అంతర్జాతీయ సంస్థ కరుణించి పాక్ కు అప్పిచ్చే పరిస్థితి ఉండదు.దీంతో అసలే కుదేలయ్యే పరిస్థితిలో ఉన్న పాక్ పని అదోగతే. అందుకే.. ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చేదిశగా ప్రయత్నాలు చేసింది పాకిస్తాన్.
రష్యా, చైనా, ఉత్తరకొరియా, పాకిస్థాన్ వంటి దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump on Nuclear Tests) చేసిన వ్యాఖ్యలపై ఇస్లామాబాద్ స్పందించింది. ఈ విషయంపై పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి (Pakistani official) అంతర్జాతీయ మీడియాకు వివరణ ఇస్తూ.. తామెప్పుడు ఇతర దేశాల కంటే ముందుగా అణు పరీక్షలను పునరుద్ధరించబోమన్నారు. అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం పాక్ కాదని.. అదేవిధంగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశంగానూ తాము ఉండబోమని స్పష్టం చేశారు.
మొదటి నుంచి పాక్ కు సహాయం చేస్తున్న చైనా సైతం.. ట్రంప్ వ్యాఖ్యలపై గట్టిగానే స్పందించింది.. తాము తొలి నుంచి బాధ్యతాయుతమైన అణ్వాయుధ దేశంగా వ్యవహరిస్తూ వస్తున్నామన్నారు
చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ (Mao Ning). బాధ్యతాయుతమైన అణ్వాయుధ దేశంగా చైనా ఎల్లప్పుడూ ఆత్మరక్షణ అణువ్యూహాన్ని సమర్థిస్తుందన్నారు. అణు పరీక్షలు నిలిపివేయాలనే విషయంలోనూ తాము అదే నిబద్ధతకు కట్టుబడి ఉంటామన్నారు.
అమెరికా చేస్తున్న అణు పరీక్షలను సమర్థించుకున్న ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను (Trump on Nuclear Tests) పరీక్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ (Pakistan) కూడా ఉందని పేర్కొన్నారు. ‘‘రష్యా, చైనా, ఉత్తరకొరియా, పాకిస్థాన్ వంటి దేశాలు అణు పరీక్షలు (Nuclear Tests) నిర్వహిస్తున్నాయి. కానీ, వీటి గురించి ఆయా దేశాలు మాట్లాడట్లేదు. మేం అలా కాదు. ఏదైనా బహిరంగంగానే చేస్తాం. దాని గురించి మాట్లాడతాం. ఇన్నాళ్లూ ఎన్ని దేశాలు అణు పరీక్షలు చేపట్టినా మేం వాటి జోలికి వెళ్లలేదు. ఇకపై అలా మిగిలిపోవాలనుకోవట్లేదు. ఇతర దేశాల మాదిరిగానే మేమూ ఈ పరీక్షలు నిర్వహిస్తాం’’ అని ట్రంప్ వెల్లడించారు.







