OTT: మర్డర్ మిస్టరీ సీక్వెల్ కు ఫిక్షనల్ స్టోరీ
ఓటీటీ(OTT)ల్లో వచ్చే సినిమాలు కూడా కొన్నిసార్లు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పటికే అలా పలు ఓటీటీ సినిమాలు మంచి టాక్ తో పాటూ విపరీతమైన ప్రశంసల్ని తెచ్చుకున్నారు. అయితే ఏదైనా సినిమా హిట్టైతే దానికి కొనసాగింపుగా ఆ ఫ్రాంచైజ్ లో మరికొన్ని సినిమాలను తీస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటారు ఆ చిత్ర మేకర్స్.
అలా 2020లో నెట్ఫ్లిక్స్(Netflix) లో రిలీజై బ్లాక్ బస్టర్ అయిన సినిమా రాత్ అకేలి హై(raat akeli hai). కొత్తగా పెళ్లైన జంట ఓ ఇంట్లోకి రావడం, ఆ తర్వాత ఇంటి యజమాని చనిపోవడం.. ఈ మర్డర్ ను ఇన్వెస్టిగేషన్ చేయడం ఇదే కథ. ఈ మూవీలో బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ(nawazuddin siddhiki) పోలీస్ పాత్రలో నటించి తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించగా, థ్రిల్లర్ మూవీ లవర్స్ నుంచి కూడా ఈ మూవీకి మంచి ప్రశంసలొచ్చాయి.
ఇప్పుడా సినిమాకు సీక్వెల్ గా రెండో భాగం రానుంది. రాత్ అకేలి హై ది బన్సాల్ మర్డర్స్(raat akeli hai the bansal murders) పేరుతో మరో సినిమా రానుంది. అయితే ఈ సారి కథ ది బన్సాల్ మర్డర్స్ అనే ఫిక్షనల్ స్టోరీ చుట్టూ తిరగనుందని మేకర్స్ చెప్తున్నారు. హనీ ట్రెహాన్(Honey Trehan) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్మితా సింగ్(Smitha singh) రైటర్ గా వర్క్ చేయగా, 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా ముందుగా స్క్రీనింగ్ అయి, తర్వాత నెట్ఫ్లిక్స్ లో ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది.







