మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లుగా యూజర్లకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. భవిష్యత్‌లో విడుదల కానున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వర్డ్ ప్యాడ్ అనే ఫీచర్ ఇక కనపించదని స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్ 1995లో విండోస్ 95 అనే ఆపరేటింగ్ సిస్టం (ఓఎస్) ను విడుదల చేసింది. కొత్తగా విడుదలైన ఈ ఓఎస్‌లో వర్డ్ ప్యాడ్ అనే వర్డ్ ప్రాసెసింగ్ టూల్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. వర్డ్ ప్యాడ్‌లో రెజ్యూమ్, లెటర్స్‌ను తయారు చేయడం, టేబుల్స్ క్రియేట్ చేయడంతో పాటు ఫోటోలను సైతం జత చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్‌లో లేని ఇటాలిక్, అండర్ లైన్, బుల్లెట్ పాయింట్స్, నెంబరింగ్, టెక్ట్స్ ఎలైన్‌మెంట్స్ వంటి అడ్వాన్స్ ఫీచర్లను సైతం ఉపయోగించుకునేలా వెసులు బాటు కల్పించింది.






