TikTok :టిక్‌టాక్ కొనుగోలు రేసులో మైక్రోసాఫ్ట్!

టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft ) చర్చలు జరుపుతోంది. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ (Trump )స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను చేజిక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్ సహా పలు టెక్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్(Elon Musk), ఒరాకిల్ చైర్మన్ ల్యారీ ఎల్లిసన్ కూడా ఈ ప్లాట్‌ఫామ్ కొనుగోలుకు పోటీపడాలని ఆయన కోరారు. టిక్‌టాక్‌లో 50 శాతం వాట అమెరికన్ కంపెనీ చేతుల్లో ఉండాలని తాను కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. జాతీయ భద్రత కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్(Biden) హయాంలో విధించిన నిషేధం అమలును ట్రంప్ 75 రోజుల పాటు వాయిదా వేశారు. అప్పటిలోగా టిక్‌టాక్ యూఎస్ కార్యకలాపాలను విక్రయించాలని, లేదంటే నిషేధానికి గురికాక తప్పదని చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్‌కు అల్టిమేటం జారీ చేశారు.