Microsoft: ఇది ఎంతో బాధాకరం.. అయినా తప్పనిసరి

మైక్రోసాఫ్ట్ (Microsoft) లో 15,000 మంది ఉద్యోగులను తొలగించాలని తీసుకున్న నిర్ణయం బాధకరమే అయినప్పటికీ కృత్రిమ మేధ (Artificial intelligence) ను అందిపుచ్చుకునేందుకు ఈ చర్య తప్పనిసరి అని సంస్థ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) చెప్పారు. ఉద్యోగుల (Employees) కు పంపించి ఒక మెమోలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. సంస్థ చర్యను సమర్థించుకున్నారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తనను ఎంతో బాధపెట్టిందని, దీని గురించి మీలో చాలా మంది ఆలోచిస్తున్నారని తనకు తెలుసునని ఈ మెమోలో ఆయన పేర్కొన్నారు. సంస్థలో 2 లక్షల మంది ఉద్యోగులకు ఆయన దీన్ని పంపించారు. ఈ నిర్ణయం అత్యంత కష్టతరమైనదని ఆయన పేర్కొన్నారు.మైక్రోసాఫ్ట్ ఏర్పడిన తరువాత మొదటిసారి మొత్తం ఉద్యోగుల్లో 7 శాతానికి సమానమైన సంఖ్యలో ఉద్యోగులకు లేఆఫ్ (Layoff) చేయాలని నిర్ణయించింది.