కామెట్ EV యొక్క ఆల్-ఎక్స్‌క్లూజివ్ ‘స్పెషల్ గేమర్’ ఎడిషన్‌ను విడుదల
ఎంజి మోటార్ ఇండియా ఈరోజు ‘గేమర్ ఎడిషన్’గా పిలువబడే కామెట్ ఈవి(EV) యొక్క ఆల్-ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది EV సెగ్మెంట్లో మొట్టమొదటిసారిగా కస్టమైజ్ చేయబడిన కారు. ఈ ఎడిషన్ యొక్క ఏస్థటిక్స్ మరియు అంబియెన్స్ భారతదేశ ప్రఖ్యాత గేమర్ ‘మోర్టల్’ (నమన్ మాథుర్), the OG MVP ద్వారా సంభావితం చేయబడింది. కామెట్ EV యొక్క ఈ వెర్షన్ ప్రస్తుత కారు ధర కంటే రూ 64,999 అదనపు ధరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు తమకు ఇష్టమైన కారును ఆన్లైన్లో ఎంజి వెబ్సైట్ https://cc.mgmotor.co.in/mgexpert/#/e-model/variants లేదా భారతదేశంలోని ఎంజి డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఈ అనుకూలీకరించిన గేమింగ్ ఎడిషన్ అన్ని కామెట్ ఈవి(EV) వేరియంట్లలో (పేస్, ప్లే, మరియు ప్లష్) అందుబాటులో ఉంది.
గేమింగ్ కమ్యూనిటీ యొక్క బోల్డ్, వైబ్రంట్, డైనమిక్ మరియు టెక్నో వైబ్ నుండి ప్రేరణ పొందిన ఈ కామెట్ EV ఎడిషన్ , గేమింగ్‌లో అడ్రినలిన్ రష్‌ని ఇష్టపడే జెన్ Z కోసం చురుకైన భావాన్ని సృష్టించడానికి డార్క్ మరియు లైట్ థీమ్‌లలో రూపొందించబడింది. ఈ వాహనాల యొక్క బాహ్య భాగాలను రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ మెటీరియల్‌తో డార్క్ క్రోమ్ మరియు మెటల్ ఫినిషింగ్‌తో ఇల్యుమినేటెడ్ టెక్స్చర్తో రూపొందించారు. కామెట్ EV ‘గేమర్ ఎడిషన్’ లోపలి భాగం గేమింగ్ ప్రియులు/అభిమానులను ఉత్సాహపరుస్తుంది మరియు నియాన్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుంది. గేమింగ్ కమ్యూనిటీ అభిరుచికి అనుగుణంగా నిర్మించబడ్డ క్యాబిన్‌లోని యాంబియంట్ లైట్ ఆకర్షణను పెంచుతుంది.
ఎంజి యొక్క టెక్-స్పిరిట్ ఎంజి Xpert, Epay, ఎంజి VPhy NFT, మరియు ఎంజి వెర్స్ (MG Verse) వంటి కార్యక్రమాలతో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. డిజైన్ మరియు టెక్నాలజీ ఏకీకరణ అవకాశాలను పునర్నిర్వచించటానికి ఎంజి మోటార్ ఇండియా మరియు మోర్టల్ కలిసి ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించినందున రెండు విభిన్న ప్రపంచాల పరాకాష్టను చూసేందుకు సిద్ధంగా ఉండండి.






