సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం.. ప్రపంచంలోనే మొట్టమొదటిది

సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం కృత్రిమ మేధ ప్రతి రంగంలోనూ అడుగుపెడుతోంది. యాంకర్‌గా మారి వార్తలు చదవడం దగ్గర నుంచి విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించడం లాంటి ఎన్నో పనులు చేసేస్తోంది. తాజాగా కృత్రిమ మేధతో రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వచ్చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అమెరికాకు చెందిన టెక్ కంపెనీ కాగ్నిషన్ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ డెవిన్ రూపొందించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది కావడం విశేషం. ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఆవిష్కరించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డెవిన్ అత్యాధునికమైనదని, ప్రముఖ ఏఐ కంపెనీల నుంచి ప్రాక్టికల్ ఇంజినీరింగ్ ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపింది. ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు అలవోకగా కోడ్ రాసేస్తుంది. వెబ్‌సైట్లను క్రియేట్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్‌ను సృష్టిస్తుంది అని కంపెనీ పేర్కొంది.