American Companies : అమెరికా కంపెనీలకు ఇది ఒక మేల్కొలుపు

చైనాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) అంకురం డీప్‌సీక్ (Deepseek ) అనూహ్యంగా తెరపైకి వచ్చి సంచలనంగా మారడం, ఏఐ (AI) మోడల్‌లను అభివృద్ధి చేస్తున్న అమెరికా కంపెనీలకు ఒక మేల్కొలుపు లాంటిది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )అన్నారు. ఈ సంస్థతో పోటీపడి విజయం సాధించాలంటే అవి మరింత చురుకైన పనితీరును కనబర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. గత రెండు రోజులుగా చైనా, చైనాకు చెందిన కొన్ని యాప్‌ల అంశం నా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ఏఐ మోడల్‌ను అత్యంత చౌకగా, వేగంగా తయారు చేస్తున్న విషయం నన్ను ఆకర్షించింది. ఒకటే రకం ఫలితాన్ని తక్కువ ఖర్చుతోనే పొందడమనేది మంచిదే కదా. పోటీ పెరిగే అవకాశం ఉన్నందున అమెరికా టెక్ కంపెనీలూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.