ఇన్ఫోసిస్ అరుదైన ఘనత.. భారత్ నుంచి ఒకే ఒక్కటి
దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే 100 బెస్ట్ కంపెనీల్లో చోటు దక్కించుకుంది. భారత్ నుంచి టాప్ 100 లో నిలిచిన ఏకైక ఐటీ కంపెనీగా నిలిచింది. 2023లో ప్రపంచంలోనే వంద అత్యుత్తమ కంపెనీల జాబితాను టైమ్స్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానానాల్లో ఆల్ఫాబెట్ (గూగుల్), మెటా (ఫేస్బుక్) కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ 64వ స్థానాన్ని దక్కించుకుంది. భారత్ నుంచి టాప్ 100 లో చోటు దక్కించుకున్న ఏకైక ఐటీ సంస్థ ఇన్పోసిస్ కావడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న 750 కంపెనీల జాబితాను టైమ్స్ తాజాగా విడుదల చేసిది. రెవెన్యూ గ్రోత్, సోషల్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ మొదలగు అంశాల ఆధారంగా కంపెనీల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇన్ఫోసిస్‌తో పాటు మరో 7 భారతీయ కంపెనీలు టాప్ 750లో చోటు దక్కించుకున్నాయి.






