ఇన్ఫోసిస్ తీపికబురు.. ఉద్యోగులకు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో సగటున 80 శాతం వేరియబుల్ పేను విడుదల చేయనుంది. ఆగస్టు జీతంతో కలిపి ఈ వేరియబుల్పేను అందించనుంది. ఈ మేరకు కంపెనీ హెచ్ టీం ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారాన్ని అందించింది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంచి పనితీరు నేపథ్యంలో తన ఉద్యోగులు సగటున 80 శాతం వేరియబుల్ వేతనం లభించనుంది. తాము క్యూ 1లో మంచి పనితీరును కనబర్చామనీ, భవిష్యత్ విస్తరణకు బలమైన పునాదిని ఏర్పాటు చేసామని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. అయితే ఉద్యోగుల పనితీరు త్రైమాసికంలో సహకారం ఆధారంగా ఈ పే ఉంటుందని పేర్కొన్నారు. అలాగే పెరఫామెన్స్ బోనస్ నిర్ణారణ నిమిత్తం తమ బడ్జెట్ సంబంధిత డీయూలకు, యూనిట్ డెలివరీ మేనేజర్లకు అందించినట్టు వెల్లడిరచింది. గత ఏడాది ఇన్ఫోసిస్ సగటు వేరియబుల్ పే 60 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.






