ఈ ఏడాది భారత వృద్ధి 6.1 శాతం : ఐఎంఎఫ్
ఈ ఏడాది భారత వృద్ధి 6.1 శాతంగా నమోదు కావచ్చొని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఏప్రిల్‌లో అంచనా వేసిన దాని కంటే ఇది 0.2 శాతం ఎక్కువ కావడం విశేషం. 2022 నాలుగో త్రైమాసికం నుంచి దేశీయంగా పెట్టుబడులు బలంగా పుంజుకోవడం ఇందుకు దోహదం చేస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ పేరుతో తాజా నివేదికను ఐఎంఎఫ్ వెలువరించింది. దీని ప్రకారం 2022లో అంతర్జాతీయ వృద్ధి 3.5 శాతంగా నమోదైందని అంచనా. 2023, 2024 సంవత్సరాల్లో అంతర్జాతీయ వృద్ధి రేటు 3 శాతానికి పరిమితం కావచ్చు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం గత ఏడాది 8.7 శాతం కాగా, 2023లో 6.8 శాతానికి 2024లో 5.2 శాతానికి పరిమితం కావొచ్చు.






