లండన్ లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్
యూకే రాజధాని నగరంలో అతిపెద్ద రెసిడెన్షియల్ డీల్‌ను భారత దేశానికి చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్ సొంతం చేసుకున్నారు. ఎస్సార్ గ్రూప్‌కు సహ యజమాని రవి రుయా ఇంధ్ర భవనం లాంటి ఇంటిని కొనుగోలు చేశారు. రష్యన్ ప్రాపర్టీ ఇన్వెస్టర్ ఆండ్రీ గోంచరెంకోకు సంబంధించిన ఈ ప్రాపర్టీ విలువ దాదాపు రూ.1200 కోట్లు. (145 మిలియన్ డాలర్లు). 150 పార్క్ రోడోలోని రీజెంట్స్ పార్క్‌కి ఎదురుగా ఉన్న హనోవర్ లాడ్జ్ మాన్షన్‌ను ఇంటిలోని జిబ్రాల్టర్- ఇన్కార్పొరేటెడ్ హాల్డింగ్ కంపెనీ విక్రయం ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భవనం పూర్తి నిర్మాణంలో ఉందని, ఫ్యామిలీ ఆఫీసు కోసం ఆకర్షణీయ పెట్టుబడులు పెట్టడానికి వెసులుబాటుగా ఉంటుందని రుయా ఫ్యామిలీ ఆఫీసు అధికార ప్రతినిధి విలియం రెగో తెలిపారు.






