అలాగైతేనే ప్రజల జీవితాల్లో మార్పు : అమెరికా మాజీ మంత్రి
భారతదేశం ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తేవాలంటే 8 శాతం వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఉందని అమెరికా మాజీ వాణిజ్య మంత్రి లారీ సమ్మర్స్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాల విభాగం, ఇండస్ట్రీ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. మరింత మూలధనం, ప్రపంచ బ్యాంక్ వంటి పెద్ద మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంకు (ఎంబిడి)లు భారత్కు అవసరం అని అన్నారు. శతాబ్దం మధ్యకాలం నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ 8 రెట్ల వృద్ధిని సాధించవచ్చని సమ్మర్స్ అంచనా వేశారు. ఎంబిడి సంస్కరణలపై స్వతంత్ర ఎగుమతి బృందానికి సహ అధ్యక్షుడిగా సమ్మర్స్ వ్యవహరిస్తున్నారు. పేద దేశాలకు మరింత నిధుల ప్రవాహం కావాలి, ప్రస్తుతం ఎంబిడిలు వారి రుణాలను తిరిగి చెల్లించేందుకు మాత్రమే నిధులను సేకరిస్తున్నాయని అన్నారు. ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు మూలధనం పెద్ద మొత్తంలో కల్గివున్నాయని, సంస్థలు మార్పు చెందాలి. పేదరికం తగ్గించేందుకు అధిక ప్రాధాన్యతనివ్వాలని ఆయన అన్నారు.






