2075 నాటికి అమెరికాను దాటనున్న భారత్
సవాళ్లను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న 50 ఏళ్లలో భారత జీడీపీ మరింత వేగంగా వృద్ధి నమోదు చేసే అవకాశముందని ఓ నివేదిక అంచనా వేసింది. 2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి గా అవతరించనుందని పేర్కొంది. అమెరికా ను దాటేసి ఈ ఘనత సాధిస్తుందని తెలిపింది. అప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ 52.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని చైనా తర్వాతి స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. దీనిపై భారత ఆర్థికవేత్త శాంతను సేన్‌గుప్తా మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి భారత్‌కు కీలక అవకాశాలున్నాయని తెలిపారు. శ్రామిక శక్తిలో భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రతిభ కలిగిన యువతకు శిక్షణ, నైపుణ్యాలను కల్పించడంపై భారత్ దృష్టి పెట్టాలన్నారు. రానున్న రెండు దశాబ్దాల్లో భారత్ ఇతర దేశాలపై ఆధారపడటం మరింత తగ్గుతుంది. తయారీ సామర్థ్యాన్ని మౌలిక సదుపాయాలు, సేవలను పెంచుకోవడంలో భారత గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది అని నివేదిక వెల్లడించింది.






