అమెరికాకు రూ.29,000 కోట్ల ఎగుమతులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబరులో అమెరికాకు మానదేశం నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 3.53 బిలియన్ డాలర్ల ( దాదాపు రూ.29,000 కోట్ల)కు పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో ఇవి 998 మి.డాలర్లు (సుమారు రూ.8300 కోట్లు) గా ఉన్నాయి. ఇదే సమయంలో ఎగుమతి అయిన స్మార్ట్‌ఫోన్ల వవాటా 2 శాతం నుంచి 7.76 శాతానికి పెరగడం కలిసొచ్చింది. అమెరికాకు మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఎగుమతిదారుగా భారత్ నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో చైనా, వియత్నాం ఉన్నాయి.