దారుణంగా అమెరికా పరిస్థితి .. ఆసియా దేశాలు టాప్
ఎకానమీ గ్రోత్ రేట్లో ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు టాప్లో ఉన్నాయి. ఇదే సమయంలో అగ్ర దేశం అమెరికా పరిస్థితి దారుణంగా ఉంది. 2022లో అమెరికా రియల్ జీడీపీ 2.1 శాతంగా ఉండగా, 2024కు ఇది 1 శాతానికి పడిపోనుంది. అమెరికా ఎకానమీ గ్రోత్ రేట్ దారుణంగా పతనం అవుతుండడం యావత్ ప్రపంచంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరొక వైపు ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయి. ఇతర ప్రాంతాల కంటే వేగంగా ఆర్థిక పురోగతి దిశగా దూసుకువెళుతున్నాయని ఐఎంఎఫ్ తెలిపింది. 2022 లో ఈ దేశాల రియల్ జీడీపీ 4.3 శాతంగా ఉండగా, 2024 నాటికి 5 శాతానికి చేరుకుంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.






