ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఐబీఎం

ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎం తమ సంస్థలో కొంత మందికి ఉద్వాసన పలికింది. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డివిజన్లలో లేఆఫ్‌లు ప్రకటించింది. కేవలం ఏడు నిముషాల సమావేంలో ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసింది. దీంతో ఉద్యోగులు షాక్ తిన్నారు. ఐబీఎం చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జొనాథన్ అదాషేక్ ఇటీవల నిర్వహించిన మార్కెటింగ్, కమ్యూనికేషన్ విభాగాల్లో లేఆఫ్‌లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంత మందిని తొలగించనున్నారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. రానున్న కాలంలో చాలా ఉద్యోగాల స్థానంలో కృత్రిమ మేధను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు గత సంవత్సరం కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ ప్రకటించారు. ఇందు కోసం కొత్త నియామకాలు నిలిపివేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. రానున్న ఐదు సంవత్సరాల్లో దాదాపు 30 శాతం ఉద్యోగుల స్థానంలో ఏఐని తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం మానవ వనరుల వంటి విభాగాల్లో నియామకాలను తగ్గించడం లేదా పూర్తిగా నిలిపివేస్తామని తెలిపారు.