హెచ్ ఎస్ డబ్ల్యూ 5 జీ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఎంబ్రాయిడరీ మెషిన్ ప్రారంభించిన సినీనటి శ్రీయా శరన్…
మహిళా ఉపాధి అవకాశాలను పెంచేందుకు హెచ్ ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ ఉపయోగకరంగా ఉంటుంది అని సినీనటి శ్రీయా శరన్ అన్నారు. నగరంలోని ఓక హోటల్ హెచ్ ఎస్ డబ్ల్యూ 5 జీ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఎంబ్రాయిడరీ మెషిన్ నిర్వహించిన కార్యక్రమంలో శ్రీయా శరన్ ముఖ్యఅతిథిగా హాజరై మెర్కెట్ లోకి విడుదల చేశారు. మహిళలు స్వయం ఉపాధి గా ఎదగాలని మరింత మందికి ఉపాధి కల్పించేందుకు ఈ ఎంబ్రాయిడరీ మెషిన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ హెచ్ ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ 8 దేశాలలో 22 రాష్ట్రంలో మహిళలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సీఈఓ తపన కపాడియా తెలిపారు. అడ్వాన్సడ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ మెషిన్ ద్వారా మగువలు మెచ్చే సరికొత్త డిజైన్లు నచ్చే విధంగా డిజైన్ చేసుకునేవిదంగా ఈ మిషన్ రూపొందించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు సుదీర్ (ఆర్టిస్ట్ మరియు యాంకర్) రాగని, వై. విజయమ్మ, గిరీష్, వాసు ఇంటూరి మరియు కంపెనీ డీలర్స్ పాల్గొన్నారు.






